కరోనా ఎఫెక్ట్: ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసిన ఇండియాలోని ఒమన్ ఎంబసీ
- March 12, 2020
మస్కట్: ట్రావెల్ వీసాల్ని ఇండియా క్యాన్సిల్ చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. ఏప్రిల్ 15 వరకు అన్ని టూరిస్ట్ వీసాల్ని ఇండియా క్యాన్సిల్ చేసింది. వైరస్ ప్రభావం వున్న ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్ని క్వారంటీన్ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈనేపథ్యంలో ఎంబసీ, తమ పౌరులకు స్పష్టమైన సూచనలు చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ తమ పౌరులు వేచి వుండాలని ఎంబసీ సూచించింది. ఇండియాలో ఇప్పటికే వున్న ఒమన్ పౌరులు, జనసమ్మర్ధం ఎక్కువగా వున్న ప్రాంతాలకు దూరంగా వుండాలని ఎంబసీ ఆదేశించింది. అత్యవసర సందర్భాల్లో ఢిల్లీ లేదా ముంబైలోని ఎంబసీలను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!