యూ.ఏ.ఈ:రెడ్ లైట్ కన్ఫ్యూషన్ తో హర్రిఫిక్ యాక్సిడెంట్..వీడియో రిలీజ్

- March 13, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:రెడ్ లైట్ కన్ఫ్యూషన్ తో హర్రిఫిక్ యాక్సిడెంట్..వీడియో రిలీజ్

యూ.ఏ.ఈ:ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అప్రమత్తంగా లేకపోవటం వల్ల ఎంతటి పెను ప్రమదాలు సంభవిస్తాయో తెలియజేస్తూ అబుధాబి పోలీసులు ఓ వీడియో షేర్ చేశారు. కన్ఫ్యూషన్ లో రెడ్ లైట్ జంప్ చేయటం కారణంగా రెండు వాహనాలు ఢీ కొన్న భయంకర ఘటనను వీడియో ద్వారా మోటరిస్టులకు వివరించారు. వీడియోలో చూపించిన ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ లైట్ పడగానే అక్కడి వాహనాలు ముందుకు కదిలాయి. అయితే..ఓ కారు మాత్రం లెఫ్ట్ టర్న్ తీసుకుంది. కానీ, లెఫ్ట్ సైడ్ వెళ్లే మార్గంలో ఇంకా గ్రీన్ లైట్ పడలేదు. దీంతో మరో దిశలో వేగంగా దూసుకొచ్చిన కారు రెప్ప పాటులో రెడ్ సిగ్నల్ జంప్ చేసిన కారును ఢీ కొట్టింది. మరో ప్రమాదంలో కూడా కారు లెఫ్ట్ టర్న్ తీసుకోగానే గ్రీన్ లైట్ పడిన రూట్ లో వెళ్తున్న కారు...లెఫ్ట్ టర్న్ తీసుకున్న ఎస్వీయూ కారుతో క్రాష్ అయ్యింది. ఈ రెండు ప్రమాదాల్లో ఇద్దరి కన్ఫ్యూషన్..కరెక్ట్ వేలో వెళ్తున్న వారిని కూడా ప్రమాదానికి గురిచేసింది. సిగ్నల్ దగ్గర వాహనదారులు అప్రమత్తంగా లేకుంటే భారీ ప్రమాదాలకు కారకులు అవుతారని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ఇదిలాఉంటే రెడ్ సిగ్నల్ వయోలేట్ చేసిన వారికి వెయ్యి దిర్హామ్ లు ఫైన్, 12 ట్రాఫిక్ పాయింట్స్ తో పాటు నెల రోజుల పాటు కార్ ఇంపౌడ్మెంట్ ఉంటుందని తెలిపారు. ట్రక్ లాంటి భారీ వాహనాలైతే 3 వేల దిర్హామ్ ల ఫైన్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని గుర్తుచేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com