ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 23న విడుదలవుతున్న‘కె.జి.యఫ్ చాప్టర్ 2’
- March 13, 2020సినిమా చరిత్రలో హిట్స్, సూపర్‌హిట్స్, బ్లాక్‌బస్టర్ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్ మూవీస్ మాత్రం అరుదుగానే వస్తుంటాయి. అలాంటి అరుదైన ట్రెండ్ సెట్టింగ్ మూవీస్‌లో ‘కె.జి.యఫ్' ఒకటి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్, స్టంట్స్ విభాగాల్లో జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2‘ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కి ప్రేక్షకులు, అభిమానుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవు్డ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల యష్, సంజయ్ దత్, రవీనాటాండన్ సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో మేజర్ షెడ్యూల్ పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఫాన్ ఇండియా చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
రాకీ భాయ్‌గా యష్ రాకింగ్ పెర్ఫామెన్స్ చేయనున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్