బహ్రెయిన్: అల్ సలమ్ ఇన్షియేటీవ్ పేరుతో కస్టమర్లకు అల్ సలమ్ బ్యాంక్ ఆఫర్
- March 15, 2020
బ్యాంక్ కస్టమర్లకు, కార్పోరేట్ సెక్టార్ కు కొద్ది మేర బెనిఫిట్ చేకూర్చేలా అల్ సలమ్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ కొత్త ఆఫర్లను ప్రకటించింది. అల్ సలమ్ ఇన్షియేటీవ్ పేరుతో అఫర్స్ ప్యాకేజీని విడుదల చేసింది. దీని ద్వారా బ్యాంక్ కస్టమర్లు, కార్పోరేట్ వర్గాలు ప్రాఫిట్ ఫ్రీ లోన్స్, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకునే అఫర్స్ పొందవచ్చు. అల్ సలమ్ ఇన్షియేటీవ్ ద్వారా సులభంగా లోన్లు పొందవచ్చని, అలాగే ప్రాసెస్ ఫీజు ఇతర ఛార్జీల నుంచి మినహాయింపు పొందవచ్చని బ్యాంక్ సీఈవో రఫిక్ నయద్ తెలిపారు. బ్యాక్స్ కార్పోరేట్, ఎస్ఎమ్ఈ, రిటైల్ కస్టమర్స్ మంచి ప్రయోజనం పొందవచ్చని ఆయన అన్నారు. సమాజ పురోగతి కోసం టీమ్ బహ్రెయిన్ మెంబర్ గా అల్ సలమ్ బ్యాంకు భాగస్వామ్యం అవుతోందని, అందులో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని రఫీక్ వెల్లడించారు. అల్ సలమ్ ఇన్ఫియేటీవ్ ప్యాకేజీ ద్వారా రిటైల్ కస్టమర్లు BD500 వరకు ప్రాఫిట్ ఫ్రీ లోన్లు పొందే అవకాశం ఉంది. అయితే..నిర్ణీత కాలవ్యవధిలోనే తిరిగి పే చేయాలి. రమదాన్ తర్వాత తొలి రీపేమెంట్ ఇన్స్ స్టాల్మెంట్ పే చేయాల్సి ఉంటుంది. లోన్ ప్రాసెస్ తొందరగా సులభంగా పూర్తి చేసేందుకు ఆన్ లైన్ లోనూ అప్లై చేసుకోవచ్చని రఫిక్ వెల్లడించారు. లోన్స్ పొందిన వారు డబ్బుతో పాటు అటోమేటిక్ గా క్రెడిట్ కార్డు లిమిట్ 10 శాతం పెంచుకోవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు