48,000 ఫేక్‌ యాపిల్‌, మైఖేల్‌ కోర్స్‌ ప్రోడక్ట్స్‌ సీజ్‌

- March 16, 2020 , by Maagulf
48,000 ఫేక్‌ యాపిల్‌, మైఖేల్‌ కోర్స్‌ ప్రోడక్ట్స్‌ సీజ్‌

దుబాయ్‌ కస్టమ్స్, 48,000 కౌంటర్‌ఫీట్‌ ఐటమ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది 2020 తొలి క్వార్టర్‌లో. వీటి విలువ 1 మిలియన్‌ దిర్హాములు వుంటుంది. యాపిల్‌ మరియు మైఖేల్‌ కోర్స్‌ ట్రేడ్‌మార్క్స్‌ పేరుతో కౌంటర్‌ఫీట్‌ వస్తువుల్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారనీ, వాటిని రీసైకిల్‌ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. వీటిలోల& 42,184 యాపిల్‌ ప్రోడక్ట్స్‌ వున్నాయి. వీటి విలువ 861,000 అని దుబాయ్‌ కస్టమ్స్, డైరెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ మన్‌హాబ్‌ ముసాబిహ్‌ చెప్పారు. గత ఏడాది 190 ట్రేడ్‌ మార్క్స్‌కి సంబంధించిన 637,00 ఐటమ్స్ సీజ్‌ చేయడం జరిగిందని ముసైబిహ్‌ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com