కరోనాపై పోరాటంలో ఖతార్...48 గంటల్లో అల్ మీరా మార్కెట్ ఏర్పాటు
- March 17, 2020
దోహా:కరోనాపై పోరాటంలో భాగంగా గత కొద్ది రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఖతార్..ప్రజలకు నిత్యావసర సరుకులు అందించటంలోనూ అంతే వేగంగా అలర్ట్నేట్
యాక్షన్స్ తీసుకుంటుంది. వైరస్ భయంతో షాపులు కూడా మూత పడుతుండటంతో ముకైనిస్ ప్రాంతంలో అల్ మీరా కొత్త తాత్కాలిక శాఖను ప్రారంభించింది. అల్ మీరా
కన్సూమర్ గూడ్స్ కేవలం 48 గంటల్లోనే స్టోర్ ను ప్రారంభించటం విశేషం. ఈ స్టోర్ ద్వారా స్థానికులకు పరిశుభ్ర పరిచిన సరుకులు, శుభ్రమైన కూరగాయాలను స్థానికులకు
అందించనున్నారు. అంతేకాదు..ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు సరుకుల కొరత ఏర్పడకుండా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో అల్ మీరా కలిసి పనిచేస్తోంది. ఈ
సందర్భంగా అల్ మీరా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ యూసఫ్ అలీ అల్ ఒబైదాన్ మాట్లాడుతూ తమ స్టోర్ ద్వారా సరుకుల సరఫరా ఒక్కటే ముఖ్య ఉద్దేశం కాదని, వైరస్ సోకే అవకాశాలు లేకుండా పరిశుభ్రమైన సరుకులను అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?