15 ఏళ్లకు స్వగ్రామం చేరనున్న వలస కార్మికుడు

- March 18, 2020 , by Maagulf
15 ఏళ్లకు స్వగ్రామం చేరనున్న వలస కార్మికుడు

షార్జా:ఉన్న ఊరిలో ఉపాధి కరువై కుటుంబ పోషణ కోసం వేలాది రూపాయలు అప్పు చేసి దుబాయ్ వెళ్లిన వలస కార్మికుడు ఏజెంట్ చేతిలో మోసపోయాడు.వివరాల్లోకి వెళితే... తెలంగాణకు చెందిన రాజన్న సిరిసిల్లా జిల్లా,కొనరావుపేట మండలం,ఎగ్లాసుపూర్ గ్రామానికి చెందిన దొబ్బల దుర్గయ్య ఉపాధికోసం 2005 లో రూ.80 వేలు అప్పు చేసి ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్ళాడు.దుబాయ్ విమానాశ్రయంలో పాస్పోర్ట్ ను ఏజెంట్ తీసుకుని వదిలేశారు.దీంతో దుర్గయ్య వీసా లేక ఇల్లీగల్ గా పనిచేశాడు.యూ.ఏ.ఈ ప్రభుత్వం ఆమ్నెస్టీకి అవకాశమిచ్చినా తెలియక వినియోగించలేకపోయాడు.6 నెలల కిందట ఇంటికి తిరిగి రావటానికి యూ.ఏ.ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయించగా 15 ఏళ్ళ పాటు ఇల్లీగల్ గా పనిచేసినందుకు 27,255 దిర్హాములు(రూ.5.5) లక్షలు జరిమానా విధించింది.జరిమానా చెల్లించే పరిస్థితి లేక నిరుత్సాహంగా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ జనగామ శ్రీనివాస్ వెంటనే స్పందించి దుర్గయ్య సమస్యను యూ.ఏ.ఈ-వాలంటీర్స్ కమిటీ ఇంచార్జి గిరీష్ పంత్ కు వివరించారు.ఆయన యూ.ఏ.లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం అధికారులతో మాట్లాడి దుర్గయ్యకు విధించిన జరిమానా రద్దు చేయించారు.

స్వగ్రామం రావటానికి విమాన టికెట్ కూడా ఏర్పాటు చేశారు.రెండు రోజుల్లో స్వగ్రామం రానుండటంతో కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com