కరోనా: తెలంగాణ మరో కీలక నిర్ణయం..
- March 18, 2020
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను నెలాఖరు దాకా మూసివేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే కోవలో తాజాగా ఆర్టీసీ కండక్టర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది.
ఇకపై కండక్టర్లు తప్పనిసరిగా తమ దగ్గర హ్యాండ్ శానిటైజర్లను ఉంచుకోవాలని తెలిపింది. బస్సులో ప్రయాణించే ప్రయాణీకులకు రెండు చుక్కలు వాళ్ల చేతులో వేసి రాసుకోమని సూచించాలని చెప్పింది. కండక్టర్లకు హ్యాండ్ శానిటైజర్లను ఆర్టీసీ యాజమాన్యమే సమకూర్చుతుంది. తద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 150కు చేరుకుంటోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు