కరోనా అలర్ట్:యూఏఈకి వచ్చే వాళ్లంతా 14 స్వీయ నిర్బంధం తప్పనిసరి
- March 19, 2020
యూఏఈలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు ఇక నుంచి 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందేనని యూఏఈ తేల్చి చెప్పింది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటార్నీ జనరల్ హమద్ అల్ షంసీ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారితోనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూఏఈకి ప్రవేశించే వాళ్లంతా క్వారంటైన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎవరికి వారు 14 రోజుల పాటు ఇళ్ల నుంచి కదల కూడదని ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించి జనసమ్మర్ధ ప్రాంతాల్లో తిరిగినా, ఇతరులతో నేరుగా కాంటాక్ట్ అయినా, వైరస్ వ్యాప్తికి దోహదపడేలా వ్యవహరించినా పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. స్వియ నిర్బంధం నిబంధనను పాటించని వారిని ఖైదు చేయటానికి వెనకాడబోమని అటార్నీ జనరల్ వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు