22న జనతా కర్ఫ్యూ:మోదీ

- March 19, 2020 , by Maagulf
22న జనతా కర్ఫ్యూ:మోదీ

ఢిల్లీ:భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకు శరవేగంగా వ్యాప్తి చెందుతు పరిస్థితి చేయి దాటి పోతున్నా తరుణంలో తాజాగా జాతినుద్దేశించి ప్రధాన మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ పలు సూచనలు చేశారు నరేంద్ర మోదీ.. అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ కు ఎలాంటి వాక్సిన్ లేదని నివారణ ఒక్కటే మార్గం అంటూ తెలిపారు. అయితే ఈ సందర్భంగా భారత ప్రజలందరూ జనతా కర్ఫ్యూ విధించారు మోదీ. ఈ నెల 22న ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ విధించుకోవాలి అంటూ దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు అంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ.కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు దేశ ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు.

భారత్ దేశ ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రించడం సాధ్యం అవుతుంది అంటూ ఈ సందర్భంగా తెలిపారు. దేశ ప్రజలందరూ ప్రస్తుతం దృఢ సంకల్పం నిబద్ధతతో మెలగాలంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతోపాటు వ్యాపారులు అందరూ ఇంటి నుంచి బయటకు రాకుండానే అన్ని పనులు చేసుకోవాలంటూ ఈ సందర్భంగా సూచించారు. భారత ప్రజలు సొంతంగా కర్ఫ్యూ విధించి కోవాలని సూచించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లలోనే ఉండి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు.

ఇలా రోజు కర్ఫ్యూ విధించుకోవటం ద్వారా విజయవంతంగా కరోనా వైరస్ ను భారత దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని.. ప్రజలందరూ కరోనా వైరస్ ను జయించవచ్చు అంటూ సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కర్ఫ్యూ విధించడంతో ప్రస్తుతం సంచలనం గా మారిపోయింది. అయితే కరోనా వైరస్ మీద పోరాటంలో ఎంతగానో కృషి చేస్తున్న వారందరికీ మార్చి 22వ తేదీన సాయంత్రం ఐదు గంటల సమయంలో ఐదు నిమిషాల పాటు ప్రజలు తమ ఇంటి గేటు వద్ద నిలబడి సైరన్ మోగించి కృతజ్ఞతలు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com