నిర్భయకేసులో దోషులకు ఉరిశిక్ష
- March 20, 2020
ఎట్టకేలకు నిర్భయకేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఢిల్లీలో తీహార్ జైలులో శుక్రవారం 5.30 గంటలకు నలుగురు దోషుల్ని.. తలారీ పవన్ జల్లాద్… ఉరితీశాడు. ఉరి అమలు చేసే సమయంలో జైలు సూపరిండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఇంఛార్జ్ ఆఫీసర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీస్, జిల్లా మెజిస్ట్రేట్ సహా పలువురు పోలీసులు అధికారులు ఉన్నారు. అంతుకు ముందు నలుగిరికి వైద్య పరీక్షలు చేశారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగుందని నిర్ధారించిన తర్వాత… ఉరి అమలు చేసినట్లు తెలిపారు అధికారులు. ఈ నలుగురికి ఉదయం 8 గంటల సమయంలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఒకేసారి నలుగురిని ఉరి తీయడం తీహార్ జైల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా ఉగ్రవాది అప్జల్‌గురుని ఉరి తీశారు. అనంతరం.. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ఉరిశిక్ష అమలు చేశారు. దోషుల్ని ఉరితీయడంతో.. నిర్భయ కేసులో న్యాయం చేసినట్లైంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు