మార్చి 31 వరకు తెలంగాణ షట్‌డౌన్..

- March 22, 2020 , by Maagulf
మార్చి 31 వరకు తెలంగాణ షట్‌డౌన్..

హైదరాబాద్:రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతున్న కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని షట్‌డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

తొలుత అధికారులు, మంత్రులతో నిర్వహించిన అత్యున్నత సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశంపైనే చర్చించి నిర్ణయం తీసుకున్నారు.భారత్‌లోనూ ఈ వైరస్ వ్యాప్తి తీవ్రమైన తరువాత తెలంగాణలోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నివారణ చర్యలు పెద్ద ఎత్తున తీసుకుంది.

విద్యాసంస్థలు, ప్రజలు గుమిగూడే అవకాశమున్న అన్ని ప్రదేశాలు మూసివేయడమే కాకుండా వివాహాలు, ఇతర వేడుకలపైనా నియంత్రణ విధించింది.తొలుత తెలంగాణలో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన పాజిటివ్ కేసులే వెలుగుచూసినప్పటికీ ఇప్పుడు వారి నుంచి స్థానికులకూ వైరస్ సోకడం ఇది మరింత తీవ్రం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలకు ఉపక్రమించింది.

అందులో భాగంగా మార్చి 31 వరకు అత్యవసర సేవలు మినహా అన్నిటినీ బంద్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ప్రజలెవరూ ఇళ్లు దాటి బయటకు రావొద్దని సూచించింది.నిత్యవసరాలు, ఇతర అవసరాలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com