దోహా:షాపుల దగ్గర ఇక సామాజిక దూరం తప్పనిసరి..మార్గదర్శకాలు విడుదల
- March 22, 2020
దోహా:కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఖతార్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి షాపుల దగ్గర సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని సూచించింది. ప్రతీ రిటైల్ షాపు నిర్వాహకులు వినియోగదారుల మధ్య సామాజిక దూరాన్ని నిబద్ధతతో పాటించేలా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలుపుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు షాపులకు వెళ్లే వినియోగదారులు ఒక్కొక్కరి మధ్య ఖచ్చితంగా 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇది కూడా వినియోగదారుల భద్రతా చట్టం నెంబర్ 8లోని ఆర్టికల్ 13 కిందకు వస్తుందని కూడా కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







