మార్చి 26 నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ బంద్‌

- March 24, 2020 , by Maagulf
మార్చి 26 నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ బంద్‌

దుబాయ్‌: దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ , దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌ విమానాశ్రయాల నుంచి అన్ని ప్రయాణీకుల విమానాలూ ఈ నెల 26 నుండి బంద్‌ చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ప్యాసింజర్‌ విమానాల్ని నిలిపివేస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే కార్గో మరియు ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్‌ ఫ్లైట్స్‌కి మాత్రం ఈ బంద్‌ నుంచి మినహాయింపు వుంటుంది. టెంపరరీ హాల్ట్‌ కోసం ఈ రెండు విమానాశ్రయాలూ సేవలు అందించనున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బంద్‌ అమల్లో వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com