ఆన్‌లైన్‌ ద్వారా వీసా రెన్యువల్‌.!

ఆన్‌లైన్‌ ద్వారా వీసా రెన్యువల్‌.!

మస్కట్‌: రెసిడెంట్‌ కార్డ్‌ హోల్డర్స్‌, తమ వీసాల్ని ఆన్‌లైన్‌లో రెన్యువల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. కరోనా వైరస్‌ కారణంగా తమ తమ స్వదేశాల్లో చిక్కుకుపోయినవారికి ఈ సౌకర్యం అందుబాటులో వుంటుందని అధికారరలు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకోసం ఒమన్‌, నాన్‌ ఒమనీయులు దేశంలోకి రాకుండా బ్యాన్‌ చేశారు. రెసిడెంట్‌ కార్డ్‌ కలిగినవారికీ ఈ బ్యాన్‌ వర్తిస్తుంది. అన్ని రకాల వీసా కలిగినవారికీ ఒమన్‌లో ప్రవేశం లేదని ఈ సందర్భంగా రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒమన్‌లో ఇరుక్కుపోయినవారు, వెంటనే తమ తమ దేశాలకు వెళ్ళిపోవాలనీ, కొందరికి మాత్రం ఆన్‌లైన్‌ ద్వారా తమ వీసాల్ని పొడిగించుకునే అవకావం కల్పిస్తున్నామని అన్నారు.

 

Back to Top