దుబాయ్‌ మెరినా ప్రొమినేడ్ మూసివేత

దుబాయ్‌ మెరినా ప్రొమినేడ్ మూసివేత

దుబాయ్‌ మెరినా ప్రొమినేడ్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ప్రొమినేడ్  ఏరియా మూసివేయబడిందని దుబాయ్‌ మెరీనాలోని సంస్థలు, ఎమ్మార్‌ మాస్టర్‌ కమ్యూనిటీస్‌ పౌరులకు తెలియజేశాయి. ఇంటి దగ్గరే వుండాలనీ, కరోనా వైరస్‌ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. యూఏఈలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 333కి పెరిగింది.

 

Back to Top