కరోనా కట్టడికి విశాఖ ఎంపీ చేయూత

- March 27, 2020 , by Maagulf
కరోనా కట్టడికి విశాఖ ఎంపీ చేయూత
విశాఖపట్నం:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైస్ (కోవిడ్-19) ను భారత దేశం నుంచి పూర్తిగా తరిమెయ్యాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యాధి  2వ దశలోనికి ప్రవేశించిందని అన్నారు. ఈక్రమంలో ఎంపీ ఆసుపత్రులలో టెస్టింగ్ కిట్స్, మందులు, ఇతర సామగ్రి కొనుగోలు చేయుటకై తన వంతుగా ,తన సొంత నిధుల సహాయం రూ..25 లక్షలు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్  చంద్ కి అందజేశారు. ఈ  సందర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు అకుంఠిత చిత్తం తో పనిచేస్తున్న  ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు, వైద్యులు, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, తదితరులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు..  కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి నివారణకు సర్వ సన్నద్థంగా జిల్లా యంత్రాంగం ఉండవలసిన అవసరాన్ని గుర్తిస్తూ, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కి వివరించారు.  కరోనా వైరస్ ను నిరోధానికి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను స్వచ్చందంగా ప్రజలందరూ పాటిస్తూ వారి వారి గృహాలకు పరిమితమై వ్యాధి వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు .ప్రజలందరూ బాధ్యతగా సామాజిక  దూరం పాటించాలని కోరారు. తన పార్లమెంట్ పరిధిలో ఏ సమస్య తలెత్తిన తక్షణ స్పందన ఇస్తామని స్పష్టం చేశారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com