కరోనా ఎఫెక్ట్ : దుబాయ్ లో డ్రైవింగ్ స్కూల్స్ రెండు వారాల పాటు మూసివేత

- March 27, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్ : దుబాయ్ లో డ్రైవింగ్ స్కూల్స్ రెండు వారాల పాటు మూసివేత

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దుబాయ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. మార్చి 26 నుంచి రెండు వారాల పాటు డ్రైవింగ్ ఇన్సిట్యూట్ మూసివేస్తున్నట్లు రోడ్లు, రవాణా శాఖ(ఆర్టీఏ) అధికారులు వెల్లడించారు. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ కోసం లర్నింగ్ ఫైల్ ను నమోదు చేసుకునే సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఎమిరేట్స్ డ్రైవింగ్ స్కూల్ తమ స్టూడెంట్స్ కు మెసేజ్ లను కూడా పంపించింది. ఈ రెండు వారాల పాటు ఎలాంటి ట్రైనింగ్ క్లాసులు ఉండవని అలాగే డ్రైవింగ్ టెస్టులు కూడా నిర్వహించబోమని ఆర్టీఏ స్పష్టం చేసింది. రాత్రి వేళ నిర్వహించే శిక్షణ తరగతులను కూడా రద్దు చేశారు. అయితే www.edi.ae ద్వారా ఆన్ లైన్ డ్రైవింగ్ పాఠాలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ కాల పరిమితి ముగిసిన వారు మార్చి 29 నుంచి వచ్చే మూడు నెలల్లో ఎప్పుడైనా స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది. కంటి పరీక్షలు, జరిమానాలు, బ్లాక్ పాయింట్స్ తో సంబంధం లేకుండా ఏడాదిలో ఎప్పుడైనా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చని ఆర్టీఐ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com