దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులకు కాన్సులేట్ చేయూత
- March 27, 2020
దుబాయ్: కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలం అయిపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలతో విమానాశ్రయాలలోనే ఎంతోమంది తమ దేశాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోతున్నారు.
ఈ క్రమంలో స్వదేశాలకు వెళ్తూ దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 19 మంది భారతీయ పౌరులు తమని ఆదుకోండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. వీరిని కాపాడేందుకు యూఏఈ ప్రభుత్వం భారత అధికారులతో సంప్రదింపులు జరిపి వారికి విమానాశ్రయం లోపల హోటల్ గదులు ఇచ్చారు. వారికి ఆహార ఏర్పాట్లు మరియు ఆర్ధిక సహాయం అందిస్తూ ఇండియన్ కాన్సులేట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటోంది. ఈ సందర్భంగా చిక్కుకున్న 19 మంది భారతీయులు యూఏఈ మరియు ఇండియన్ కాన్సులేట్ కు కృతఙ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!