ఇటలీని కుదిపేస్తున్న కరోనా..9000 మంది మృతి
- March 28, 2020
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని అతలాకుతలం అవుతున్నా..ఇటలీలో మాత్రం పెను బీభత్సం సృష్టిస్తోంది. కంటికి కనిపించని వైరస్ తో ఆ దేశం అల్లకల్లోలం అవుతోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజుకు వెయ్యి మంది వరకు మృతి చెందుతున్నారు. రోజుకు వేలల్లో జనం కొత్తగా వైరస్ బారిన పడుతున్నారు మొన్న ఒక్క రోజే వెయ్యి మందికిపైగా వైరస్ తో చనిపోయారు. నిన్న 919 మంది మృతి చెందారు. దీంతో కరోనా ఇటలీలో మృతి చెందిన వారి సంఖ్య 9,134 వేలు దాటింది. ప్రపంచంలోని ఏ దేశంలో పోల్చినా ఇది రెట్టింపు. ఇక వైరస్ ఎపిక్ సెంటర్ చైనాతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. అమెరికాలో వైరస్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఇటలీలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. శుక్రవారం ఒక్క రోజులోనే ఇటలీలో కొత్తగా 5,959 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం పేషెంట్ల సంఖ్య 86,498 మందికి పెరిగింది. వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టం చేయలని ఇటలీ నిర్ణయించింది.
ఇందులో భాగంగా స్కూల్స్ కు సెలవులను పొడగించాలని నిర్ణయించారు. వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గి పరిస్థితులు సురక్షితంగా మారినప్పుడే మళ్లీ స్కూల్స్ ప్రారంభిస్తామని ఇటలీ విద్యా శాఖ మంత్రి లూసియా అజోలినా తెలిపారు. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత విస్తృతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.
మరో 300 మంది ప్రైవేట్ డాక్టర్లు, ప్రైవేట్ ల్యాబులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







