పేవ్‌మెంట్ పార్కింగ్ ఫైన్ 500 దిర్హామ్‌లు
- January 25, 2016
షార్జా మున్సిపాలిటీ వాహనదారులకు వారి వాహనాల పార్కింగ్‌పై కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. పేవ్‌మెంట్‌పై పార్కింగ్ చేసినట్లయితే 500 దిర్హామ్‌ల ఫైన్ తప్పదని హెచ్చరించారు అధికారులు. వాహనాలు పేవ్‌మెంట్‌లపై పార్కింగ్ చేయకుండా భారీగా ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించారు. ఇక ముందు కూడా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయి. పేవ్‌మెంట్లపై పార్కింగ్ కారణంగా, పేవ్‌మెంట్లు, గోడలు దెబ్బ తింటున్నాయని అధికారులు చెప్పారు. అలాగే మోటిరస్టులు తమ వాహనాల్ని పార్కింగ్ ప్రాంతాల్లో కూడా సరైన రీతిలో పార్కింగ్ చేయాలనీ, స్లాట్‌లో సరిగ్గా పార్కింగ్ చేయకపోయినా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారని అధికారులు చెప్పారు. ఎక్కువ సమయం పబ్లిక్ ప్లేసుల్లో వాహనాల్ని నిలిపి ఉంచడం కూడా ఇబ్బందికరమేనని అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో దుబాయ్ పోలీసులు 10 రోజులపాటు క్యాంపెయిన్ నిర్వహించారు. అలాగే, రహదార్లపై ప్రమాదాలు తగ్గించేందుకు కొత్త రాడార్లను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







