సౌదీ:కొడుకుని ముద్దు చేయలేని డాక్టర్ తండ్రి
- March 29, 2020
సౌదీ అరేబియా:అసలే డాక్టర్.. డ్యూటీకి వెళాపాళాలు ఉండవు. ఇప్పుడు కరోనా కారణంగా డాక్టర్ నాన్న మరింత బిజీ. ఎప్పుడు ఇంటికి వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో తెలియదు.తను మెలకువగా ఉన్నప్పుడు నాన్న వచ్చేసరికి ఆనందం పట్టలేక ఒక్కసారిగా పరిగెట్టాడు ఆ పసివాడు నాన్న కౌగిట్లో ఒదిగిపోదామని. కానీ నాన్న మాత్రం కొడుకుని తనివితీరా ముద్దు చేయలేని పరిస్థితి. సౌదీ అరేబియాకు చెందిన ఓ వైద్యుడు విధులు నిర్వర్తించుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే కొడుకు ఎదురొచ్చినా.. వద్దు దగ్గరకు రావొద్దు అని చెప్పాల్సి వచ్చింది. ఆ విషయం ఆ చిన్నారికి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆరు సెకన్లు ఉన్న ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో మైక్ అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోని ఇప్పటి వరకు నాలుగు మిలియన్లమందికి పైగా చూడడంతో ఇంటర్‌నెట్‌లో ఇప్పుడిది వైరల్ అయ్యింది. కరోనా ఎఫెక్ట్‌తో అందరూ లాక్‌డౌన్ అని ఇంట్లో ఉంటే డాక్టర్లు, పోలీసులు మరికొంత మంది సిబ్బంది ఇంతకుముందు కంటే మరిన్ని ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..