COVID-19/దుబాయ్: ఆస్తిని విరాళంగా ఇచ్చిన భారతీయ వ్యాపారవేత్త
- March 29, 2020
దుబాయ్: COVID-19 ను ఎదుర్కోవటానికి యూఏఈ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫింజా జ్యువెలరీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ అజయ్ శోబ్రజ్ F ఫిన్జా తన ఉదారత్వాన్ని నిరూపించారు.
25 సంవత్సరాలుగా దుబాయ్ లో నివసిస్తున్న ఫింజా, 'జుమేరా లేక్ టవర్స్'లోని తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. కరోనా కు వ్యతిరేకంగా పోరాడుతున్న యూఏఈ ప్రభుత్వానికి బాధిత రోగులను నిర్బంధించడం కోసం ఈ భవనాన్ని ఇస్తున్నాను అంటూ 'టు సపోర్ట్ అండ్ గివ్ బ్యాక్ దట్ కేర్స్' అనే శీర్షికతో దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) కు లేఖ రాశారు ఫింజా.
77,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 400 మందికి వసతి అందించగల ఈ భవనం అవసరమైన అన్ని ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా డీప్ క్లీనింగ్, శానిటైజేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సర్వీసింగ్ సహా అన్ని అవసరమైన సర్వీసింగులు చేయించి సిద్ధంగా ఉంది అని అధికారులు తెలిపారు.
అజయ్ శోబ్రజ్ F ఫిన్జా ఇలా అన్నారు: “ఇలాంటి సవాలు సమయాల్లో, ఈ మహమ్మారిని అధిగమించడానికి సమాజం కలిసి రావడం మరియు మనం నివసించే దేశానికి మద్దతు ఇవ్వడం అత్యవసరం. ఈ క్లిష్టమైన కాలంలో ప్రభుత్వానికి నా సహాయాన్ని అందించడం మరియు గత 25 సంవత్సరాలుగా నా విజయానికి మరియు వృద్ధికి తోడ్పడుతున్న నగరానికి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.”
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







