2016 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..
- January 25, 2016
కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాలను ప్రకటించింది. 10 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 87 మందికి పద్మశ్రీ పురస్కారాలు కేంద్రం ప్రకటించింది. మీడియా రంగంలో రామోజీరావుకు సినీ రంగంలో రజినీకాంత్ పద్మ విభూషణ్ వరించాయి. సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌కు పద్మ భూషణ్ అవార్డులు రాగా.. ప్రియాంక చోప్రా, రాజమౌళికి పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. పద్మ విభూషణ్ అవార్డులు యామినీ కృష్ణమూర్తి - ప్రముఖ నృత్యకారిణిరజినీకాంత్ - సినీ రంగంగిరిజా దేవి - సంగీత విద్వాంసురాలురామోజీ రావు - మీడియా రంగంవిశ్వనాథన్ శాంత - వైద్య రంగంశ్రీశ్రీ రవి శంకర్ - ఆధ్యాత్మిక గురువుమాజీ గవర్నర్ జగ్‌మోహన్ - ప్రజా సేవల రంగంవాసుదేవ కల్‌కుంటే ఆత్రే - శాస్త్ర సాంకేతిక రంగంఅవినాష్ దీక్షిత్ - విద్య, సాహిత్య రంగంధీరూభాయ్ అంబానీ - మరణానంతరం పద్మ విభూషణ్ వరించింది. పద్మ భూషణ్ అవార్డులు సానియా మీర్జా, సైనా నెహ్వాల్, అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, రామ్‌సుతార్, వినోద్ రాయ్, హీస్నమ్ కన్‌హేలాల్, బర్జీందర్ సింగ్ హందర్డ్, స్వామి తేజోమయానంద, ప్రొఫెసర్ ఎస్.ఎస్. రామానుజ తాతాచార్య, డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బ్రిజేందర్‌సింగ్, బెనెట్ కోల్మన్ అండ్ కంపెనీ చైర్మన్ ఇందు జైన్‌తో పాటు భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రాబర్ట్ డీ బ్లాక్‌నిల్‌కు మరణానంతరం పద్మ భూషణ్ వరించింది. పద్మ శ్రీ అవార్డులు ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, ప్రముఖ సినీనటుడు అజయ్ దేవగన్, ప్రముఖ సినీనటి ప్రియాంక చోప్రా, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, అక్షయ్ కుమార్, మధుర్ భండార్కర్‌తో పాటు పలువురికి పద్మ శ్రీ అవార్డులు వరించాయి
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







