షార్జా స్టెరిలైజేషన్‌..బయటకి వస్తే రాడార్ బారిన పడినట్టే

షార్జా స్టెరిలైజేషన్‌..బయటకి వస్తే రాడార్ బారిన పడినట్టే

 

షార్జా:షార్జా పోలీసులు, నిర్బంధన షరతులను ఉల్లంఘిస్తున్న వాహనదారుల్ని గుర్తించేలా రాడార్లని యాక్టివేట్‌ చేశారు.స్టెరిలైజేషన్‌ ఆపరేషన్‌ రోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జరుగుతున్న సమయంలో రోడ్లపైకి వచ్చేవారిపై ఈ రాడార్లు ప్రత్యేక నిఘా పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే, దానికి సంబంధించి అనుమతిని అధికారుల నుంచి పొందాల్సి వుంటుంది. లేని పక్షంలో, భారీ జరీమానాలతోపాటు, జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.పర్మిట్ కోసం ఈ పోలీస్ వెబ్సైటు www.shjpolice.gov.ae లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Back to Top