చైనా లో భారీ అగ్నిప్రమాదం..19 మంది మృతి

- March 31, 2020 , by Maagulf
చైనా లో భారీ అగ్నిప్రమాదం..19 మంది మృతి

చైనా: నైరుతి చైనాలో భారీ అటవీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మాటలతో పోరాడుతుండగా పద్దెనిమిది అగ్నిమాపక సిబ్బంది మరియు ఒక అటవీ గైడ్ మరణించారు. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిచాంగ్ నగరానికి దగ్గరగా ఉన్న పర్వతాల నుండి ఆకాశంలోకి పెద్దగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆకాశం ఎర్రగా మారటం ప్రజలు గమనించారు. 700,000 మంది జనాభా ఉన్న ఈ నగర భవనాలు మరియు రహదారులపై భారీ పొగ మేఘాలు అలుముకున్నాయి. మంటలను అరికట్టడానికి 140 కి పైగా ఫైర్ ఇంజన్లు, నాలుగు హెలికాప్టర్లు మరియు దాదాపు 900 అగ్నిమాపక సిబ్బందిని పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మొత్తం రెండువేల మందికి పైగా అత్యవసర కార్మికులు మంటలను అరికట్టడానికి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు మరియు 1,200 మందికి పైగా స్థానిక ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com