తెలుగు రాష్ట్రాల్లో హై టెన్షన్..
- March 31, 2020
తెలుగు రాష్ట్రాల్లో కరోనా.. ఇప్పుడు ప్రభుత్వాలను, ప్రజలను కలవర పెడుతోంది. ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో తెలుగువారు వెల్లినట్టు తెలియడంతో అధికారులు అలర్టయ్యారు. అక్కడికి వెళ్లినవారితో పాటు వారితో సన్నిహితంగా మెలిగినవారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కాగా తెలంగాణలోని కోవిడ్ మరణాలు ఒక్కసారిగా ఆరుకు చేరాయి. ఈ ఆరుగురూ కూడా ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడంతో తీవ్ర కలకలం చెలరేగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ నుంచి 280 మంది ఈ ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది.
అందుతోన్న ప్రకారం తెలంగాణ నుంచి ప్రాంతాల వారీగా మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు:
హైదరాబాద్ 186
మెదక్ 26
వరంగల్ 25
నల్గొండ 21
నిజామాబాద్ 18
కరీంనగర్ 17
రంగారెడ్డి 15
ఖమ్మం 15
నిర్మల్ 11
భైంసా 11
ఆదిలాబాద్ 10
కాగా ఢిల్లీ వెళ్లి వచ్చినవారు వెంటనే తమ వివరాలను వెల్లడించాలని తెలంగాణ సీఎంవో కోరింది. వారికి ఉచితంగా టెస్టుల చేయించి, వైద్య సాయం అందిస్తామని ప్రకటించింది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. అందులో ఇతర దేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రేయర్స్ లో పాల్గొన్నారు.
మరోవైపు ప్రార్థనల కోసం ఢిల్లీకి వెళ్ళొచ్చిన వారిలో ఏపీకి చెందినవారు 711 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 13 జిల్లాల నుంచి కూడా భక్తుల అక్కడికి వెళ్లినట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో నమోదైన పాజిటివ్ కేసులకు మూలాలు దిల్లీ వెళ్ళొచ్చిన వారేనని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. వీరిలో ఆస్పత్రి క్వారంటైన్ లో 122 మంది, ప్రభుత్వ క్వారంటైన్ లలో మరో 207 మంది ఉన్నారు.హోమ్ క్వారంటైన్ లో మరో 297 మంది ఉన్నారు. ఇంకా ఆచూకీ తెలియని 85 మంది.. డేటాను సేకరిస్తున్న పోలీసులు, వైద్యాధికారులు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!