గ్రేడ్ ఆధారంగా జీతం తగ్గిస్తున్న దుబాయ్ సంస్థ..కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

గ్రేడ్ ఆధారంగా జీతం తగ్గిస్తున్న దుబాయ్ సంస్థ..కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

గ్రేడ్‌ను బట్టి జీతాల్లో తగ్గింపులు...ఏప్రిల్ నుండి అమలు..

యూఏఈ: కోవిడ్ -19 కరోనావైరస్ ప్రభావంతో మారుతున్న మార్కెట్ పరిస్థితుల కారణంగా యూఏఈ లోని ట్రాన్స్‌గార్డ్ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ, సౌకర్యాల నిర్వహణ, నగదు సేవలు మరియు వైట్ కాలర్ సిబ్బందిని అందించే ట్రాన్స్‌గార్డ్ గ్రూప్, ప్రస్తుతం తాత్కాలికంగా పనిని కోల్పోయిన 12,000 మంది సైట్ ఆధారిత ఉద్యోగుల ఆహార/నిత్యావసరాలను తీర్చేందుకు ఏప్రిల్‌లో తమ సంస్థ  నిర్వహణ సిబ్బంది జీతాలను తగ్గిస్తున్నట్లు మంగళవారం తెలిపింది.

ఆదివారం సాయంత్రం సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో, మేనేజింగ్ డైరెక్టర్ గ్రెగ్ వార్డ్, సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో 12,000+ ఉద్యోగులకు మూడు పూటలా ఆహారం ఒక నెలపాటు సమకూర్చటంలో దోహదపడుతుంది అంటూ వివరణ ఇచ్చారు. ఏప్రిల్ పే స్లిప్‌లలో ప్రతిబింబించే తగ్గింపులు గ్రేడ్‌ను బట్టి ఉంటాయనీ, సీనియర్ మేనేజ్‌మెంట్ వారి జీతాలపై అధిక తగ్గింపులను విధిస్తుంది అని యాజమాన్యం తెలిపింది.

Back to Top