‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’

- March 31, 2020 , by Maagulf
‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’

విజయవాడ:కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఎక్కడా అలసిపోకుండా విధులు నిర్వరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  పోలీసులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందనలు తెలియజేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నిరంతరం సేవలందిస్తున్న పోలీసులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.  ఈ మేరకు రాష్ట్ర పోలీసులకు, వారి కుటుంబాలకు డీజీపీ సవాంగ్‌ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ‘మీరు చేస్తున్న సేవలు ఆపారమైనవి. రక్షక భటుడు అనే పేరుకు సార్ధకత జరిగింది. నిజంగా మీరు ప్రజా రక్షక భటులు. ప్రజా ప్రాణరక్షణే కింకర్తవ్యంగా భావించి సేవలందిస్తున్న సిబ్బందిని చూసి గర్వపడుతున్నాను. కరోనా కట్టడికి విధులు నిర్వహిస్తున్న పోలీసులకి అండగా నిలుస్తున్న పోలీస్ కుటుంబాలకి ధన్యవాదాలు. పోలీస్ కుటుంబాలు పరోక్షంగా చేస్తున్న త్యాగాలు మరువలేనివి. కరోనా వైరస్ ను తరిమి కొట్టడంలో ఇంకా చాలా పని ఉంది. అతి త్వరలో ఈ కరోనా మహమ్మారి ని తరిమి కొడతామని పోలీసుల తరపున రాష్ట్ర ప్రజానీకానికి నేను మాట ఇస్తున్నాను’ అని సవాంగ్‌ లేఖలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com