దుబాయ్:గడువు ముగిసన హెల్త్ కార్డుల చెల్లుబాటు..డీహెచ్ఏ ప్రకటన
- April 03, 2020
దుబాయ్:మీ హెల్త్ కార్డుల గడువు ముగిసినా చింతిచాల్సిన పని లేదు. హెల్త్ కార్డుల గడువు ముగిసినా మరో మూడు నెలల పాటు చెల్లుబాటులోనే ఉంటాయని దుబాయ్ ఆరోగ్య శాఖ అధికార వర్గాలు(DHA) వెల్లడించాయి. ఈ మేరకు ఆరోగ్య సేవలు అందించే సంస్థలకు డీహెచ్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. హెల్త్ కార్డుల గడువు ముగిసిందనే కారణంగా ఏ ఒక్క పేషెంట్ కు చికిత్స ఆపకూడదని కూడా హెచ్చరించింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో హెల్త్ కార్డుల గడువు పెంపు ఎంతో మందికి ప్రయోజనకరంగా మారనుందని డీహెచ్ఏ వెల్లడించింది. ప్రజల బాగోగుల, ఆరోగ్య సంరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంరక్షణ కోసం అవసరమైన జాగ్రత్తలు, నివారణ చర్యలు ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉంటామని డీహెచ్ఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..