కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అలర్ట్ చేసే యాప్
- April 03, 2020
ఢిల్లీ: కరోనావైరస్ భారత దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వ్యాధి ఎవరి నుంచి ఎవరికి సోకింది అక్కడి నుంచి ఈ మహమ్మారి మరెంతమందికి సోకిందనేది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన ప్రకటించగా భారత కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రజలు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం లేకుండా ఉండేందుకు లేదా గుర్తించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వశాఖ కొత్తగా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించింది.
ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కరోనావైరస్‌ను గుర్తించడంలో సహాయపడే ఒక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ పేరు ఆరోగ్య సేతు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఇది ఎప్పటికప్పుడు ఆరోగ్యపరిస్థితిని వివరిస్తుంది. దీని ద్వారా వైరస్ సోకిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. బ్లూటూత్ టెక్నాలజీ , ఆల్గరిథమ్స్, మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వ్యక్తి ఎవరెవరితో మాట్లాడాడు దాని వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందనేది ఈ యాప్ తెలియజేస్తుంది.
ఒక్కసారి ఈ యాప్‌ను స్మార్ట్ ఫోన్‌లో ఇన్స్‌టాల్ చేసుకుంటే.. దగ్గరలో ఉన్న ఆరోగ్య సేతు ఇన్స్‌స్టాల్ చేసి ఉన్న స్మార్ట్ ఫోన్లను డిటెక్ట్ చేస్తుంది. ఇక ఎవరైనా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మరొకరితో కాంటాక్ట్‌లోకి వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. అంతేకాదు ఎంత రిస్క్ ఉంటుందో కూడా లెక్కిస్తుంది. ఇందుకోసం కొన్ని పారామీటర్లను పరిగణలోకి తీసుకుంటుంది. దీని ఆధారంగా ఒక మనిషి కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఎంతమేరకు ఉందో ఆరోగ్య సేతు యాప్ తెలుపుతుంది. ఇక అధికంగా ఉంటే వెంటనే ప్రభుత్వానికి సమాచారం యాప్ చేరవేస్తుంది. ఇక ఇక్కడి నుంచి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఐసొలేషన్ అవసరమైతే ఆ చర్యలు కూడా తీసుకుంటుంది.
ఇంకెందుకు ఆలస్యం మిమ్మలను మీరు కాపాడుకోవాలంటే వెంటనే మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని సురక్షితంగా ఉండండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోండి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







