అమెరికాలో కరోనాతో ఒక్కరోజులో 1169 మంది మృతి.!
- April 03, 2020
అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా కేవలం 24 గంటల వ్యవధిలో 1,169 మంది కరోనా బాధితులు తుది శ్వాశ విడిచారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ కరోనా కారణంగా ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించలేదు. ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ ద్వారా గురువారం వెల్లడైంది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల నుంచి గురువారం రాత్రి 8:30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తంగా 6,095 మంది మృత్యువాత పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా దేశంలో మొత్తం 2,45,380 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదుకాగా.. వాటిలో 503 కేసులు కొత్తగా నమోదైనవి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..