కరోనా: నెల రోజులు షట్‌డౌన్ ప్రకటించిన సింగపూర్ ప్రధాని

కరోనా: నెల రోజులు షట్‌డౌన్ ప్రకటించిన సింగపూర్ ప్రధాని

కోవిడ్-19 కారణంగా వచ్చే మంగళవారం నుంచి నెల రోజుల పాటు సింగపూర్ దేశ వ్యాప్తంగా షట్‌డౌన్ అమలు చేయనున్నట్టు సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్ ప్రకటించారు. 

''అత్యవసర సేవలు, కీలక ఆర్ధిక రంగాలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ మూసివేస్తున్నాం. ఆహార తయారీ సంస్థలు, సూపర్ మార్కెట్లు, హాస్పిటళ్లు, రవాణా, కీలక బ్యాంకింగ్ సర్వీసులు తదితర సేవలన్నీ అందుబాటులో ఉంటాయి..'' అని లూంగ్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందనీ.. కోవిడ్-19 కారణంతా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా సింగపూర్‌లో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య వెయ్యి దాటగా... ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 

Back to Top