యూఏఈ: విదేశీయులను వారి దేశాలకు తరలించేందుకు తాత్కాలిక ఫ్లైట్స్ ఏర్పాటు

యూఏఈ: విదేశీయులను వారి దేశాలకు తరలించేందుకు తాత్కాలిక ఫ్లైట్స్ ఏర్పాటు

యూఏఈ ​:విదేశీయులు, ప్రవాసీయులను వారి వారి దేశాలకు తరలించేందుకు యూఏఈ తాత్కాలిక విమాన సర్వీసులను నడపనుంది. కరోనా వైరస్ ప్రభావంతో యూఏఈ అన్ని అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ పర్యటించేందుకు వచ్చిన విదేశీయులు యూఏఈలోనే చిక్కుకుపోయారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవాసీయులు కూడా సొంత దేశాలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు, ప్రవాసీయులు ప్రయాణమయ్యేందుకు అంతర్జాతీయ సర్వీసుల రద్దు నిర్ణయాన్ని కొద్ది మేర సడలించింది. తాత్కాలిక ఫ్లైట్లను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న విదేశీయులను సొంత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ప్రవాసీయులు ఎవరైనా యూఏఈ విడిచి వెళ్లాలని అనుకుంటే ఆయా దేశాల రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా యూఏఈ విదేశాంగ శాఖ కోరింది. 

 

Back to Top