కరోనా అలెర్ట్:ఎమిరేట్ తొలి ఫ్లైట్ సర్వీసుకు అనుమతి..ఫ్లైట్ సస్పెన్షన్స్ తర్వాత ఇదే తొలిసారి

- April 03, 2020 , by Maagulf
కరోనా అలెర్ట్:ఎమిరేట్ తొలి ఫ్లైట్ సర్వీసుకు అనుమతి..ఫ్లైట్ సస్పెన్షన్స్ తర్వాత ఇదే తొలిసారి

దుబాయ్:ఎమిరేట్ ఎయిర్ లైన్స్ ఎట్టకేలకు తమ తొలి ఫ్లైట్ సర్వీసును ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కరోనా ప్రభావంతో పలు దేశాలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి కూడా అంతర్జాతీయ విమానసర్వీసులు నిలిచిపోయాయి. అయితే..ఎట్టకేలకు పలు దేశాల నుంచి ఎమిరేట్ ఎయిర్ లైన్స్ అనుమతి రావటంతో ఏప్రిల్ 6 నుంచి తిరిగి తమ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దుబాయ్ నుంచి లండన్, ప్రాంక్ ఫర్ట్, పారిస్, బ్రస్సెల్స్, జూరిచ్ సర్వీసులను నడపనుంది. దుబాయ్ నుంచి లండన్ కు వారానికి నాలుగు సర్వీసులు మిగిలిన నగరాలకు వారంలో మూడు సర్వీలను కొనసాగించనుంది. అయితే..ఇది కేవలం యూఏఈ నుంచి ఆయా నగరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం మాత్రమే నడుపుతున్న సర్వీసులని కూడా సంస్థ తెలిపింది. సరుకుల రవాణా మాత్రం రెండు మార్గాల్లో కొనసాగుతాయని వెల్లడించింది. త్వరలోనే పరిస్థితులు చక్కబడి పూర్తి స్థాయిలో సర్వీసులను పునరిద్ధరిస్తామని సంస్థ ప్రతినిధిలు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించింది. ఫ్లైట్ లో మ్యాగజిన్, న్యూస్ పేపర్ సౌకర్యాలు ఉండవని, అలాగే ఎయిర్ పోర్టులో లాంజ్ సౌకర్యాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రతీ ప్రయాణం తర్వాత విమానాన్ని తప్పనిసరిగా శుభ్రపరుస్తామని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com