ఖతార్ : కార్మికుల ఆరోగ్య భద్రత ప్రాధాన్యత..ప్రైవేట్ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ

ఖతార్ : కార్మికుల ఆరోగ్య భద్రత ప్రాధాన్యత..ప్రైవేట్ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ

కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు భద్రతకు అత్యధిక ప్రధాన్యం ఇస్తున్నట్లు ఖతార్ కార్మిక, మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ రంగాల్లోని ప్రైవేట్ కంపెనీలు కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా నిర్మాణ రంగ కార్మికుల పని గంటలను 6 గంటలకు తగ్గించాలని మార్గదర్శకాల్లో సూచించింది. కార్మికులు పని చేసే చోట, వారు ఉంటున్న గదుల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది. కార్మికులకు అకామిడేషన్ కల్పించిన గదుల్లో ఒక్కో కార్మికుడికి కనీసం 6 చదరపు మీటర్ల ప్రాంతాన్ని కేటాయించాలని, తద్వారా సోషల్ డిస్టెన్స్ పాటించాలని వెల్లడించింది. మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం..కార్మికులు పని చేసే ప్రాంతం, వారు అకామిడేషన్ కల్పించిన చోట, వారు ప్రయాణం చేసిన బస్సులు, కిచెన్, క్యాంటీన్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాల్సి ఉంటుంది. వార్డ్ రోబ్స్, డోర్ నాబ్స్, కీ బోర్డ్స్, రీమోట్స్ వాడే అందరూ వాడే అవకాశాలు ఉంటాయి కనుక..ఆయా చోట్ల వాడిపాడేసే వైప్స్ ను అందుబాటులో ఉంచాలి. కార్మికులు విధుల్లోకి వెళ్లే ముందు ప్రతీ రోజు తప్పనిసరిగా వారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేయాలి, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నాయేమో అడిగి తెల్సుకోవాలి. కార్మికులతో టచ్ లో కంపెనీ ప్రతినిధి కార్మికులకు వారీ వారీ భాషల్లో కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. పని ప్రదేశంలో, నివాస గదుల్లో తరచుగా చేతులను శుభ్రపరిచుకోవాలని, తమ్మినా, దగ్గిరా మోచేతి మడమ అడ్డుగా పెట్టుకోవాలని, వీలైనంత వరకు ముఖ భాగాలను చేతులతో ముట్టుకోకుండా జాగ్రత్తపడాలని కార్మికులకు కంపెనీ ప్రతినిధి ద్వారా అవగాహన కల్పించాల్సి ఉంటుంది.  అన్నింటి కంటే ముఖ్యంగా పని గంటల కుదింపుతో పాటు వర్క్ ప్లేసులో వీలైనంత తక్కువ మంది ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నివాస గదుల్లో కార్మికులు గుమికూడకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రైవేట్ కంపెనీలకు సూచించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Back to Top