తెలంగాణ:229కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ:229కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఇవాళ(03 ఏప్రిల్ 2020) ఒక్కరోజే రాష్ట్రంలో భారీగా 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే ఏకంగా ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. షాద్‌నగర్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో కరోనా మరణాలు నమోదయ్యాయి.

ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో రికార్డైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరుకుంది. చనిపోయిన వారి సంఖ్య 11కి చేరుకోగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 అయ్యింది. వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 32 మంది కరోనాను జయించారు.


ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 186 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి ఫ్యామిలి మెంబర్స్, సన్నిహితులను కలుపుకుని నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.

Back to Top