కరోనా అలెర్ట్:వచ్చేవారంలో విదేశాల్లోని కువైటీయన్ల రాక..
- April 04, 2020
కువైట్:వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన కువైటీయన్లను సొంత దేశానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే వారం రెండో విడతగా మరికొందరు కువైటీయన్లు స్వదేశానికి చేరుకోనున్నారు. అయితే..కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న వారి కోసం విమానాశ్రయాల్లోనే తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేసి అక్కడే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లో ప్రజా వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కేవలం 48 గంటల్లోనే తాత్కాలిక హాళ్లు నిర్మించి విమానాశ్రయ అధికారులకు అప్పజెప్పాల్సి ఉందని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తమకు కేటాయించిన ప్రదేశంలో భూమిని చదును చేస్తున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఫ్లోరింగ్ పూర్తి చేసి వేగంగా హాళ్లను ఏర్పాటు పనులను పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇదిలాఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో పలు దేశాలు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది కువైటీయన్లు పలు దేశాల్లో చిక్కుకుపోయారు. దీంతో అయా దేశాల నుంచి వారిని దశల వారిగా కువైట్ తీసుకొస్తున్నారు. తొలి విడతలో భాగంగా గత నెల 25 నుంచి 29 మంది 11 దేశాల నుంచి 2,710 మందిని కువైట్ తీసుకొచ్చారు. రెండో విడతలో భాగంగా వచ్చే వారం మరికొందర్ని కువైట్ తీసుకొస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







