మనామాలో కార్ల ధ్వంసం
- January 26, 2016
సుమారు 50కి పైగా కార్లు మనామా గేట్ ప్రాంతంలో ధ్వంసం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆగంతకులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలియవస్తున్నది. ఎక్కువగా వలసదారుల కార్లపైనే ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడులకు సంబంధించి 20కి పైగా ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. తెల్లవారు ఝామున 3 గంల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 3.30 నిమిషాల సమయంలో తాను లేచి చూడగా, కార్లు ధ్వంసమయి ఉన్నాయని రణిజిత్ పోడి అనే వ్యక్తి చెప్పారు. ఓ వ్యక్తి ఈ దాడులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని యువకుడిగా గుర్తించినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. అయితే ఆ యువకుడు ఎవరన్నది తెలియరాలేదు. అద్దాలను పదునైన ఆయుధంతో పగలగొట్టారనీ, అలాగే వైపర్ బ్లేడ్స్ని తొలగించేందుకు ప్రయత్నించారని వాహనదారులు రిపోర్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







