అల్‌ సజాలో కరోనా విక్టిమ్స్ ఖనానికి ‘నో’

అల్‌ సజాలో కరోనా విక్టిమ్స్ ఖనానికి ‘నో’

షార్జా:కరోనా వైరస్‌తో మృతి చెందినవారిని అల్‌ సెజా ప్రాంతంలో ఖననం చేయడానికి అనుమతించరాదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌కి షార్జా రూలర్‌, సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో 19 మంది కరోనా మృతుల్ని ఖననం చేసినట్లుగా ఓ వీడియో క్లిప్‌ వెలుగు చూడ్డంతో, రూలర్‌ స్పందించినట్లు తెలుస్తోంది. కాగా, అలాంటిదేమీ జరగలేదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ స్పష్టతనిచ్చింది. షార్జా మీడియా బ్యూరో ఈ విషయమై స్పదిస్తూ, అధికారిక ప్లాట్‌ఫామ్స్ నుంచి వచ్చే సమాచారాన్ని తెలుసుకోవాలనీ, రూమర్స్‌ పట్ల స్పందిచరాదనీ, వాటిని ప్రచారం చేయరాదని పేర్కొంది.

Back to Top