టెలిఫోన్‌ ద్వారా నెలవారీ ఓపెన్‌ హౌస్‌ నిర్వహించిన ఇండియన్‌ అంబాసిడర్‌

టెలిఫోన్‌ ద్వారా నెలవారీ ఓపెన్‌ హౌస్‌ నిర్వహించిన ఇండియన్‌ అంబాసిడర్‌

మస్కట్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ఒమన్‌లోని ఇండియన్‌ అంబాసిడర్‌, ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని టెలిఫోన్‌ ద్వారా నిర్వహించారు. అంబాసిడర్‌ మును మహావర్‌ అలాగే ఎంబసీ స్టాఫ్‌ దృష్టికి ఈ సందర్భంగా ఇండియన్‌ సిటిజన్స్‌ తమ గ్రీవెన్సెస్‌ని తెలియజేశారు. కోవిడ్‌19 తీవ్రత నేపథ్యంలోనూ ఓపెన్‌ హౌస్‌ ప్రత్యేక మార్గంలో నిర్వహించడం ఆనందంగా వుందని చెప్పారు అంబాసిడర్‌. ప్రతి నెలా ఓ శుక్రవారం రోజున ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని ఎంబసీ ప్రాంగణంలో నిర్వహిస్తారు. అంబాసిడర్‌, ఇతర ఎంబసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)

 

Back to Top