ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని

- April 06, 2020 , by Maagulf
ఆసుపత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని

కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రముఖుల నుంచి సామాన్య, పేదలకు కూడా ఈ రాకాసి కబలిస్తోంది. వేల మంది మృతి చెందుతున్నారు. ప్రపంచం మొత్తం వణుకుతోంది. ఇప్పటికే అనేక దేశాల ప్రముఖ వ్యక్తులు దీని బారిన పడి..క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. స్వయంగా ఈ విషయాన్ని వారే తెలియచేశారు కూడా. ప్రధాన మంత్రులు, రాణులు, సైనాధ్యక్షులు ఇలా..ఎందరినో వదిలిపెట్టలేదు. తాజాగా బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనను ఆసుపత్రిలో చేరిపించారు.

* ప్రపంచ దేశాలపై కరోనా పంజా
* ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షలు దాటిన బాధితులు
* నిన్న ఒక్కరోజే 65వేలకుపైగా కొత్త కేసులు నిర్ధారణ
* 70వేలకు చేరువలో కరోనా మరణాలు

* కొత్తగా 4,488 మంది మృతి
* అమెరికాలో 3,34,125 కరోనా పాజిటివ్ కేసులు
* అగ్రాజ్యంలో ఒక్కరోజే 22,768 కేసులు నమోదు
* అమెరికాలో పదివేలకు చేరువలో కోవిడ్‌ మరణాలు

తన ఆరోగ్యం బాగానే ఉందని, ఏడు రోజుల క్వారంటైన్ పూర్తయ్యిందని స్వయంగా ఆయన వెల్లడించారు. ఇంకా స్వల్పంగా వైరస్ లక్షణాలు ఇంకా ఉన్నట్లు, శరీరంలో టెంపరేచర్స్ ఉందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..వ్యాధి పూర్తిగా తగ్గేంత వరకు క్వారంటైన్ లోనే ఉంటానని జాన్సన్ అన్నారు.

* ఇటలీలో ఇప్పటి వరకు 15,887మంది మృతి
* స్పెయిల్‌ 12,518మందిని బలితీసుకున్న కరోనా
* ఫ్రాన్స్‌లో 8078 మంది కరోనాకు బలి
* బ్రిటన్‌లో 4934 మంది కరోనాతో మృతి
* జర్మనీలో 1576 మంది మృత్యువాత

ఇదిలా ఉంటే..బ్రిటన్ లో పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. ఇప్పట్లో ఈ వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించింది బ్రిటన్. ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇప్పటిదాక సుమారు 50 వేల కేసులు, దాదాపు 5 వేల మంది చనిపోయినట్లు దాక నమోదైనట్లు అంచనా.

* న్యూయార్క్‌లో మరణ మృదంగం
* న్యూయార్క్‌లో ఒక్క రోజే 630 మంది మృతి
* వారంలోగా పరిస్థితి మరింత ప్రమాదకరం
* ఆరోగ్య సిబ్బందికి మాస్క్‌లు, పీపీఈల కొరత
* వెంటిలేటర్లకూ ఇబ్బందే
* వుహాన్‌కి రెట్టింపు సంఖ్య దిశగా న్యూయార్క్
* న్యూయార్క్ రాష్ట్రాన్ని ముంచెత్తుతోన్న కరోనా సునామీ
* శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం
* సూపర్‌ మార్కెట్ల వద్ద దొమ్మీలు
* యాంటీ మలేరియా డ్రగ్స్ సరఫరా కోసం భారత్‌కి విజ్ఞప్తి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com