అమెరికా లో 10 వేలకు చేరువలో కరోనా మృతులు
- April 06, 2020
అమెరికా:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుక్షణం ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య 10వేలకు చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 16 లక్షల మంది వైరస్ నిర్థారణ పరీక్షలు జరిగినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన మరోసారి గుర్తు చేశారు. 9/11 ఉగ్రదాడిని మించి కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజే 1,188 మంది కరోనా కారణంగా మరణించారు. కొత్తగా మరో 23 వేల మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వైద్య పరికరాలను, రక్షణ సాధనాలను తెప్పించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో ఈ సంక్షోభాన్ని భారీ విపత్తుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







