యూఏఈ: అన్నార్తులకు ఆహారం అందించే ఒక చక్కని అవకాశం

- April 06, 2020 , by Maagulf
యూఏఈ: అన్నార్తులకు ఆహారం అందించే ఒక చక్కని అవకాశం

యూఏఈ: కరోనా తాకిడికి ఆహారం దొరకక ఎందరో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వారికి సహాయం అందించేందుకు 'Zomato' ఒక చక్కని ఆలోచనతో ముందుకొచ్చింది. కేవలం AED 10 చెల్లిస్తే ఆహరం కోసం ఇబ్బంది పడుతున్నవారికి ఆహారం అందిస్తోంది. అదెలా అనుకుంటున్నారా..

ఈసారి మీరు ఏదన్న స్నాక్స్/మీల్ జొమాటో లో ఆర్డర్ చేసినప్పుడు, 'Meal for Hope' అనే ఆప్షన్ ఉంటుంది. అది సలెక్ట్ చేసినప్పుడు 3 విభాగాలు లభ్యమవుతాయి. మీకు తోచిన ఆప్షన్ ఎంచుకొని డబ్బులు చెల్లిస్తే సరి. మీరు అందించే సహాయం అన్నార్తులకు సహాయంగా నిలుస్తుంది.

ఒక భోజనం సమకూర్చేందుకు - AED10
ఆరు భజనలు సమకూర్చటానికి - AED50
పన్నెండు భోజనాలు సమకూర్చటానికి - AED100

వంటి వివిధ భాగాల్లో ఈ సేవ లభ్యమవుతోంది. మానవత్వాన్ని చాటుకుందాం అది కూడా ఇంటి నుండి కదలకుండానే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com