ఒమన్‌లోకి కొన్ని గూడ్స్‌ ప్రవేశంపై తాత్కాలిక అనుమతి

- April 06, 2020 , by Maagulf
ఒమన్‌లోకి కొన్ని గూడ్స్‌ ప్రవేశంపై తాత్కాలిక అనుమతి

మస్కట్‌: గవర్నమెంట్‌ కొన్ని ఫుడ్‌ ప్రోడక్ట్స్‌, హెల్త్‌ ఐటమ్స్ మరియు గూడ్స్‌ని ఒమన్‌లోకి వచ్చేందుకు తాత్కాలిక అనుమతిని మంజూరు చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించింది. అరబిక్‌ లాంగ్వేజ్‌లో వివరాల్ని ప్రింట్‌ చేయకపోయినా, ఇంగ్లీషు మరో ఆప్షనల్‌ లాంగ్వేజ్‌లో వివరాల్ని పేర్కొనే ఫుడ్‌ ప్రోడక్ట్స్‌, హెల్త్‌ ఐటమ్స్ అలాగే గూడ్స్‌ ఈ తాత్కాలిక అనుమతితో దేశంలోకి రానున్నాయి. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఫుడ్‌ పోడక్ట్స్‌ని, హెల్త్‌ మెటీరియల్స్‌ మరియు గూడ్స్‌ని ఇంపోర్ట్‌ చేస్తే చట్టపరమైన చర్యలుంటాయి. 1,000 ఒమన్‌ రియాల్స్‌ వరకూ జరీమానా విధిస్తారు. ఉల్లంఘనలు మళ్ళీ మళ్ళీ జరిగితే జరీమానా రెట్టింపవుతుంది.

--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com