యూఏఈ:కరోనా విపత్తే అదనుగా పెరిగిపోతున్న ఆర్ధిక మోసాలు
- April 06, 2020
యూఏఈ:ఓ వైపు ప్రజలంతా కరోనా వైరస్ విపత్తుతో అల్లాడిపోతుంటే ఇదే అదనుగా ఆర్ధిక నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలు, నకిలీ వెబ్ సైట్లతో ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం దుబాయ్ కి చెందిన ఒరిజినల్ వెబ్ సైట్ల తరహాలోనే నకిలీ వెబ్ సైట్లను రూపొందించి ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఈ మేరకు దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ(DFSA) ప్రజలను హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్లు ముందుస్తుగా చిన్న మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత అకౌంట్ ఖాళీ చేస్తారని DFSA హెచ్చరించింది. పన్నులు, ఫీజులే కాదు చివరికి లంచాల పేరుతో కూడా నకిలీగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. లేటెస్ట్ గా ఇలాంటి మోసమే ఒకటి వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు తాము సౌత్ కొరియా నుంచి సంప్రదిస్తున్నట్లు బాధితుడికి ఫోన్ చేసి ప్రైజ్ గెలుకున్నట్లు నమ్మించారు. DFSA పేరుతో ఓ నకిలీ డాక్యుమెంట్ కూడా పంపించారు. అయితే..ప్రైజ్ మనీ పొందాలంటే ముందస్తుగా ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఇందుకోసం Dh 10,400 చెల్లించి తమ ఆఫీసులో ప్రైజ్ కలెక్ట్ చేసుకోవాలని ఆశపెట్టారు. దీంతో ప్రైజ్ కోసం బాధితుడు Dh 10,400 చెల్లించాడు. ఆ తర్వాత బాధితుడు ప్రైజ్ కోసం DFSA ఆఫీస్ రిసెప్షన్ లో సంప్రదించటంతో అసలు విషయం బయటపడింది. తమ సంస్థలో ఎలాంటి ప్రైజ్ ఆఫర్ లేవని రిసెప్షన్ ఉద్యోగి తెలపటంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించాడు.
లైసెన్స్డ్ ఫైనాన్స్ సర్వీస్ DFSA పేరుతో ఇలాంటిదే మరో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో కంపెనీ లోగోను కాపీ చేయటమే కాకుండా DFSA అధికారిక వెబ్ సైట్ తరహాలోనే నకిలీ వెబ్ సైట్ రూపొందించి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అయితే..బాధితులను సంప్రదించే విధానాలను మోసగాళ్లు ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. కొన్ని సార్లు నేరుగా ఫోన్ కాల్స్ తో సంప్రదిస్తుండగా మరికొన్ని సార్లు టెక్ట్స్ మెసేజ్ లు, ఈ మేయిల్ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు. పైగా డబ్బులు కలెక్ట్ చేసుకునే సమయంలో ముందు జాగ్రత్తగా ఏదైనా కాఫీ షాపులో కలుసుకొని ఫేక్ రిసీప్ట్ లు ఇస్తున్నారు. అయితే..ఇలాంటి ఆర్ధిక మోసగాళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. DFSA నకిలీ వెబ్ సైట్లో సాధారణంగా కొన్ని లోపాలు ఉంటాయని వాటిని గుర్తించి మోసగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. అలాగే మోసగాళ్లు ప్రైజ్ మనీ అంటూ ఆశపెట్టే ఏ మెసేజ్ లకు, ఫోన్ కాల్స్ కు స్పందించొద్దని హెచ్చరించారు.
--బాలాజీ (మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







