లాక్‌డౌన్ కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు:కేసీఆర్
- April 06, 2020
హైదరాబాద్:రాష్ట్రంలో సోమవారం నాటికి 364 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్ధికంగా దెబ్బతింటే కోలుకుంటామని అన్న కేసీఆర్.. ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమని చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే భారత్‌లాంటి ఎక్కువ జనాభా గల దేశంలో లాక్‌డౌన్ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారెంటైన్‌లో ఉంచామని చెప్పారు.. నిజాముద్దీన్ ఘటనతో కలిపి 364 మంది కరోనా భారిన పడ్డారని అన్నారు. అలాగే ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్ చేశామని.. వైరస్ భారిన పడి 11 మంది చనిపోయారని అన్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్సలో వున్నారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించామని చెప్పిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







