గోఎయిర్ ఎయిర్లైన్స్: ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్
- April 06, 2020
ముంబై:ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గోఎయిర్ ప్రతినిధి వెల్లడించారు. గోయిర్ సంస్థ 15 ఏప్రిల్ 2020 నుండి దేశీయ విమానాల్లో ప్రయాణానికి సంబంధించి బుకింగ్ ప్రారంభిస్తుందని.. అంతర్జాతీయ విమానాల బుకింగ్.. మే 1 నుండి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. గత వారం, భారతదేశ జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ఏప్రిల్ 30 వరకు అన్ని విమానాల కోసం ముందస్తు బుకింగ్లను నిలిపివేసింది.
కరోనావైరస్ యొక్క వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్డౌన్ మార్చి 25 నుండి కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దాంతో దేశీయ విమానాలు ఆగిపోయాయి, కానీ అంతకు ముందే చాలా విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.. దీనికి కారణం ప్రయాణికులు లేకపోవడమే. ఈ క్రమంలో గోఎయిర్ సంస్థ లాక్ డౌన్ తరువాత రోజు బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించడం కీలక పరిణామంగా మారింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు