ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్...
- April 07, 2020
లండన్ : కరోనా వైరస్ బారిన పడిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (55) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూకు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆదివారం లండన్ ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరానని బోరిస్ ఓ వీడియో కూడా విడుదల చేశారు.
అయితే సోమవారం మాత్రం వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ప్రధాని ఆసుపత్రిలో చేరడంతో యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రభుత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు.ఇక ప్రధాని పరిస్థితి ఇలా ఉండడంతో ప్రపంచ దేశాధినేతలు, బ్రిటన్ ప్రజలు, సెలెబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పంపుతున్నారు. ఇక బ్రిటన్‌లో కరోనా కేసులు సంఖ్య 51,608 కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 5,373 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 13,46,990 మందికి కరోనా సోకగా, 74,702 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







