ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. వారికి అంకితం చేసిన WHO

- April 07, 2020 , by Maagulf
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. వారికి అంకితం చేసిన WHO

ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం... ప్రతీ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు.. అయితే, ఈ సారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది... కరోనా వైరస్ విస్తరిస్తూ దేశాలకు దేశాలను వ్యాప్తిస్తూ ఉండడంతో... వైద్యులు, వైద్య సిబ్బంది మొత్తం ఇప్పుడు కరోనా బాధితుల సేవల్లో నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రావడంతో.. ఈ రోజును న‌ర్సుల‌కు అంకితం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).. హెల్త్ హీరోల‌కు థ్యాంక్స్ చెప్పాల‌ని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది. ప్రస్తుతం ప్రపంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్నది. ఈ నేప‌థ్యంలో హెల్త్ వ‌ర్కర్లే.. ముందువ‌రుస‌లో సేవ‌లు అందిస్తున్నారు. కోవిడ్‌పై పోరాటం చేస్తున్నది వారే.  వైర‌స్ నుంచి మ‌న‌ల్ని ర‌క్షించేందుకు ప‌గ‌లూరాత్రి క‌ష్టప‌డుతున్నారు. న‌ర్సుల‌కు, మిడ్‌వైవ్స్‌కు థ్యాంక్స్ చెప్పాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్విట్టర్ వేదికగా కోరింది. ఈ విపత్కర పరిస్థితుల్లో క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతోన్న మన హెల్త్ హీరోలకు థ్యాంక్స్ చెబుదాం...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com